13, 14 రౌండ్లలో టీఆర్ఎస్ జోరు.. తగ్గిన బీజేపీ మెజార్టీ

  • 13వ రౌండులో టీఆర్ఎస్ కు 304 ఓట్ల ఆధిక్యత
  • 14వ రౌండులో 288 ఓట్ల లీడ్
  • మొత్తంమీద 3,438 ఓట్ల ఆధిక్యతలో బీజేపీ
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు రౌండు రౌండుకు మారుతున్నాయి. 12వ రౌండులో మూడో స్థానంలో నిలిచిన టీఆర్ఎస్... ఆ తర్వాత వరుసగా 13, 14 రౌండ్లలో ఆధిక్యతను చాటింది. 13వ రౌండులో 304, 14వ రౌండులో 288 ఓట్ల లీడ్ ను టీఆర్ఎస్ అభ్యర్థి సాధించారు.

ఈ నేపథ్యంలో 14వ రౌండు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యత తగ్గింది. 14వ రౌండులో టీఆర్ఎస్ కు 2,537 ఓట్లు రాగా, బీజేపీకి 2,249, కాంగ్రెస్ కు 784 ఓట్లు పడ్డాయి. 14వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ 3,438 ఓట్ల లీడ్ లో ఉంది. మరోవైపు 15వ రౌండులో కూడా టీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.  

Dubbaka
BJP
TRS
Congress

More Telugu News